చిన్నతనం నుండి నాకు పుస్తకాల పిచ్చి
బాగా పట్టేయడానికి కారణం మా నాన్న గారు సంపాదించిన పుస్తకాలే.ఆ పుస్తకాలు
తెగ చదివే అలవాటు కాస్తా, పిచ్చిగా మారింది. నేను చదివే వాటిల్లో ఎక్కువగా
వారపత్రికలు, మాసపత్రికలే వుండేవి.వుదాహరణకి చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర,
విస్డం, ఈనాడు ఆదివారం లాంటివి. ఐతే మా నాన్నగారు హస్య ప్రియులు కావడంవల్ల
ఎక్కువగా మంచి హాస్యపత్రికలు కొనేవారు.
అలాంటి వాటిల్లో అప్పుడు మా నాన్నగారు కొని చదివే ఒక మంచి పత్రికే హాస్యప్రియ.హాస్యప్రియ పేరుకు తగ్గట్టుగానె నాకు ఎంతో ప్రియమైన నవ్వుల పత్రిక.ఇది దాదాపు 24 ఏళ్ళ నాటి సంగతి.అప్పట్లో చిన్నవాడిని కావడం వల్ల పుస్తకం చదివేయడమే గాని సంపాదకులు,రచయితలు వంటి సమాచారం చూసేవాడిని కాదు.చూడాలి అని నాకు తెలిసేదీ కాదు.కాని హాస్యప్రియ మట్టుకు నాకు బాగా నచ్చేది.చదివిన హాస్యప్రియ సంచికలనే మళ్ళీ మళ్ళీ తెగ చదివేవాడిని.అలా ఆ పత్రికలు అన్నీ పచారి కొట్టు వాడికి బలైపోయే వరకు నా నేస్తాలే.తరువాత కొంత కాలం నేను నా ప్రియ నేస్తాన్ని మర్చిపోయాను.
మళ్ళీ నాకు హాస్యప్రియ గుర్తువచ్చిన సంధర్భం జంధ్యాలగారి ష్ గప్ చుప్ సినిమా చూసినప్పుడు.హాస్యప్రియ జంధ్యాలగారి మానసపుత్రికే అని అనిపించింది.హాస్యప్రియ జంధ్యాలగారి సొంత పత్రికే అనుకుంటా.ఎందుకంటే ష్ గప్ చుప్ సినిమా హాస్యప్రియలో సీరియల్‌గా వచ్చింది. హాస్యప్రియ మొత్తం జంధ్యాల మార్కు కామెడితోనే వుంటుంది. జంధ్యాలగారు రచించిన ష్ గప్ చుప్ నవలే హాస్యప్రియలో సీరియల్‌గా వచ్చేది.దాన్నే తరువాత భానుప్రియ,నిర్మలమ్మ,సుత్తివేలు,సుధాకర్ మొదలైన వాళ్ళతో సినిమాగా తీసారు.ష్ గప్ చుప్ చూసినప్పుడల్లా నాకు హాస్యప్రియ గుర్తుకువచ్చినా, మళ్ళీ నా చదువుల్లో పడిపోయి మర్చిపోతూవుండేవాడిని. అలా ఇంతకాలనికి నాకు తీరిక దొరికి మళ్ళి హాస్యప్రియని గుర్తుచేసుకుని అందరితో నా జ్ఞాపకాలను పంచుకొనే అవకాశం వచ్చింది.
హాస్యప్రియ లో నాకు జ్ఞాపకం వున్న శీర్షికలు, ఓ క్రోక్విలమ్మ,ష్ గప్ చుప్ నవల, టీవి టీవి డివ్విట్టం , ఇంకా కొన్ని కార్టూన్లు.
టీవి టీవి డివ్విట్టం షీర్షికలో దూరదర్శన్‌లో పని చేసే ప్రముఖులు, శాంతి స్వరూప్గారు (న్యూస్ రీడర్‌గా ఆయన అందరికీ బాగా తెలుసు) పాఠకుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవారు.ప్రశ్నలు టీవీ కార్యక్రమాలకు సంబందించి వుండేవి.వాటికి ఆయన హాస్యపూరితంగా సమాధానాలు ఇస్తూ వుండేవారు.
అలాగే ఓ క్రోక్విలమ్మ అని పత్రిక నిండా రెండు మూడు పేజీలకు ఒక చెణుకుల్లాంటి పదాలు వుండేవి.
హాస్యప్రియలో నాకు బాగా గుర్తుండిపోయినవి కార్టూన్లే. సీజన్‌కి తగ్గ కార్టూన్లు హాస్యప్రియలో వచ్చేవి. ఇప్పుడు అంతా క్రిక్కెట్ మయం అయిపోయింది గాని, నా చిన్నతనంలో అంటే దాదాపు 80ల నుంచి 1996 వరల్డ్ కప్ వరకు క్రిక్కెట్ సీజనల్ గేమ్. సంవత్సరంలో ఏదో ఒక సీజన్లోనే ఆడేవారు. అలా క్రిక్కెట్ సీజన్లో వచ్చే హాస్యప్రియలో క్రిక్కెట్ మీద కార్టూన్లు వచ్చేవి.భలే వుండేవి ఆ కార్టూన్లు.
ఒక కార్టూన్లో ఒకడు బేట్ని తిరగేసి పట్టుకుంటాడు. వాడిని చూసి మిగతవాళ్ళు “వాడు రికమండేషన్ కేండిడేట్లే ” అని అనుకుంటూ వుంటారు.
అలాగే ఇంకో దాంట్లో ఒకడు కేచ్ పట్టుకోబోతే వాడి చేతిలోకి బాల్ కన్నా ముందు ప్రేక్షకుల్లో నుండి ఒకడు విసిరిన బాంబ్ వచ్చి పడుతూవుంటుంది. ఆ కార్టూన్ చూడగానే చాలా నవ్వొస్తుంది.
మరో కార్టూన్లో ఒకడు తనతో బేటింగ్ చెయ్యడానికి ఇంకొకడిని అసిస్టెంట్‌గా తీసుకువస్తాడు. కారణం వాడు మంత్రిగారి అబ్బాయంట.
దీపావళి సీజన్లో టపాకాయల మీద కార్టూన్లు వచ్చేవి.
అప్పట్లో తీర్థయాత్రలకు తీసుకువెళ్ళే ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువగా వుండేవాళ్ళు.కొన్ని ట్రావెల్స్ వాళ్ళు 15 రోజుల్లో భారతదేశ యాత్రలు అంటే, మరికొందరు 10 రోజుల్లో చూపించేస్తాం అని పోటీలుపడేవాళ్ళు. వాటి మీద కూడా కార్టూన్లు వచ్చేవి.
ఒక ట్రావెల్స్ వాడు కొండ కిందనుంచే గుడిని చూపించి దండం పెట్టుకోమనేవాడు.బస్సు మీద 10 రోజుల్లో భారతదేశ యాత్రలు అని వుంటుంది. యాత్రికులు,”10 రోజుల్లో యాత్రలు అంటే ఏమో అనుకున్నాం నువ్వు ఇలా చూపించి దండం పెట్టుకోమంటే ఎలాగయ్యా” అని వాణ్ణి కొరకొరా చూస్తు అడుగుతుంటారు.
అలాగే ఇంకో కార్టూన్లో బస్సు మీద “వేగం కాదు ముఖ్యం గమ్యం చేరుటయే ముఖ్యం” అని వుంటుంది. అందులోంచి అస్తిపంజరాలు దిగుతూ వుంటాయి స్టాపులో. ఇలా పత్రిక నిండా కార్టూన్లే కార్టూన్లు.
నేను గూగుల్‌లో వెదికానుగాని నాకు ఎక్కడా హాస్యప్రియ జాడ తెలీలేదు. అంతగా ఈ పత్రికని అందరూ ఎలా మర్చిపోయారో మరి. హాస్యప్రియ కూడా చాల కొద్ది రోజులే వచ్చినట్టు వుంది.ఎందుకు అంటే జంధ్యాలగారు వున్నప్పుడు కూడా ఈ పత్రిక రాలేదు మరి(90లలో).కేవలం 80ల ప్రాంతాల్లో హాస్యప్రియ వచ్చినట్టు వుంది. నేను చదివిన పత్రికలు కూడా 87,88,89 సంవత్సరాలవే.వాటిల్లో ఆహ నా పెళ్ళంట ప్రకటన (సినిమా యాడ్) (రాజేంద్ర ప్రసాద్,బ్రహ్మానందం చెట్టు మీద కూర్చున్న ఫోటో), చందమామ రావే (ఉషా కిరణ్ మూవీస్ వారిది) ప్రకటన వచ్చాయి. అలాగే రెండు రెళ్ళు ఆరు సినిమా తెలుసు కదా, అందులో పి ఎల్ నారాయణ “నేను, మీ పెద్దమ్మ భారతదేశ యాత్రలకు టిక్కెట్లు తీసుకున్నాము” అని చెప్తాడు. ఆ సమయంలో వచ్చిన హాస్యప్రియలో యాత్రలకు వెళ్ళే కార్టూన్లు వచ్చాయి అన్నమాట.
ఇలా పత్రిక మొత్తం జంధ్యాలగారి మార్కు కామెడితో హాస్యపుజల్లు కురుస్తూ వుంటుందీ. ఏదిఏమైన నేను చాలా అదృష్టవంతున్ని అనిపిస్తుంది జంధ్యాలగారి కాలంలో పుట్టడం, లేకపోతే అసలు ఇంత స్వచమైన హాస్యం ఆస్వాదించే అవకాసం వుందేది కాదు కదా.మా నాన్నగారికి కూడ నాకు అంత మంచి పత్రికలు చదివే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకున్న ఈ జ్ఞనం అంతా ఆయన పెట్టిన బిక్షే. ఒక్క హాస్యప్రియే కాదు ఇంకా చాలా మంచి పుస్తకాలు నాకు కొనిచ్చేవారు మా నాన్నగారు. హాస్యప్రియ పుస్తకం మళ్ళీ నాకు కనిపించదు. కాని హాస్యప్రియ గురుతులు మాత్రం నాతోనే జీవితాంతం వుంటాయి.